టాక్ లోగోని ఆవిష్కరించిన ఎంపీ కవిత
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK - టాక్) లోగో ను హైదరాబాద్ లో ఎంపీ కవిత గారు ఆవిష్కరించారు. లండన్ నుండి వచ్చిన టాక్ ప్రతినిధులు నర్రా సాయి, రాకేష్ రెడ్డి కీసర ఎంపీ కవిత గారిని కలిసి సంస్థ ఆశయాలను, బంగారు తెలంగాణ నిర్మాణం లో వారి పాత్ర గురించి వివరించారు. తెలంగాణ ఆడబిడ్డ కవిత గారి చేతుల మీదగు లోగోను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని, మమ్మల్ని ప్రోత్సహించి లోగోను ఆవిష్కరించినందుకు కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పడుతున్న సంస్థ యూకే లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డల తో పాటు క్షేత్రస్థాయిలో కూడా మంచి సేవలందించాలని కోరారు, అలాగే సంస్థ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 28 న లండన్ లో ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి నర్రా సాయి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఇతర సభ్యులు రాజ్ కుమార్ శానబోయిన , మల్లేష్ పప్పుల, సుభాష్ కుమార్ తదితరులు ఉన్నారు.
I am very excited about the new initiative and future of TAUK. As an organization we have created strong objectives to do service to the community in UK and back home. This is not a time to be complacent or think that we have achieved the level of recognition that we have earned...
Great initiative by the passionate Telanganites to create one big platform for all Telanganites living in UK to build Banagru Telangana. Feel prestigious and proud to be part of the team....