Banner Image Here

Main News

లండన్‌లో ఘనంగా "టాక్ చేనేత బతుకమ్మ - దసరా సంబురాలు"
image Here

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుంచి ఆరు వందల మందికి పైగా ప్రవాస తెలంగాణ కుటుంబాలు హాజరయ్యాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే. టి. ఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం జరిపిన వేడుకలను "చేనేత బతుకమ్మ మరియు దసరా " గా జరుపుకున్నామని, మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంత సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల తెలిపారు.

కల్చరల్ ఇంచార్జ్ అశోక్ దూసరి మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుంచి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా " అలాయ్ - బలాయ్ " కార్యక్రమం లో, సిరిసిల్ల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి ( బంగారం) ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హాజరైన ప్రవాస సంఘాల ప్రతినిదులు ఐక్యతను చాటుతూ మనమంతా ఒకటే అంటూ చేయి చేయి కలిపి అభివాదం చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంశించారు.

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ మరియు దసరాపండగలను మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. బతుకమ్మలని నిమ్మజ్జనం చేసి తదుపరి సాంప్రదాయ బద్దంగా సద్దులప్రసాదం ఇచ్చపుచ్చుకున్నారు.

ఈ కార్యక్రమం లో స్థానికి బ్రిటిష్ ఎంపీ సీమ మల్హోత్రా మరియు భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్, లాంబెత్ మాజీ మేయర్ సాలేహ జాఫర్ తో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు, చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు.

టాక్ వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ సిరిసిల్ల నుంచి తెప్పించిన ప్రత్యేక కండువాలను అందరికి వేసి కేటీర్ ఇచ్చిన పిలుపు మేరకు చేనేత కు చేయూతని ఇచ్చే కార్యక్రమానికి తమ వంతు సహాయాన్ని అందించామన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, ఈ సంవత్సరం

వేడుకలను “చేనేత బతుకమ్మ” గా నిర్వహించామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేత వస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా వుందని అన్నారు.

ఇక్కడికి వచ్చిన ప్రవాసులు టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు మరియు ఎన్నారై టి. ఆర్. యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ అద్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షులు సేరు సంజయ్ ,స్వాతి బుడగం, ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి రేకుల,మరియు ముఖ్య సభ్యులు గోపాల్ మేకల ,మట్టా రెడ్డి,వెంకట్ రెడ్డి దొంతుల,నవీన్ రెడ్డి ,శ్రీకాంత్ జెల్ల,అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల,శ్రీధర్ రావు ,మల్లా రెడ్డి, రంజిత్ చాతరాజు ,సాయి బూరుగుపల్లి ,సత్యం కంది ,వంశీ వందనపు ,వేణు గోపాల్ రెడ్డి,గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్ ,శ్రీనివాస్ మేకల ,నవీన్ భువనగిరి ,రవి రత్తినేని ,రవి ప్రదీప్ పులుసు,సత్యపాల్ పింగిళి ,సత్య చిలుముల,శ్రీధర్ రెడ్డి, రాజేష్ వర్మ ,రవి కిరణ్,వెంకీ సుదిరెడ్డి,అరవింద్,సాయి బాబు నర్రా మహిళా విభాగం సభ్యులు సుమా దేవి పురుమని,జాహ్నవి వేముల ,సుప్రజ పులుసు,ప్రవల్లిక భువనగిరి,క్రాంతి రత్తినేని,శ్రావ్య వందనపు,శైలజ జెల్ల,సుషుమ్న ,సుమ,అపర్ణ, దీప్తి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు

Image Here
  • Anil Kurmachalam
  • Founder's Message
  •       I am very excited about the new initiative and future of TAUK. As an organization we have created strong objectives to do service to the community in UK and back home. This is not a time to be complacent or think that we have achieved the level of recognition that we have earned...

Image Here
  • Rathnakar Kadudula
  • President's Message
  •    Great initiative by the passionate Telanganites to create one big platform for all Telanganites living in UK to build Banagru Telangana. Feel prestigious and proud to be part of the team....

FACEBOOK FEED
TWITTER HANDLE