"టాక్ లండన్ బోనాల" జాతర పోస్టర్ ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 7న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
మన తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీ.ఆర్.యస్ యుకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ సంస్థ ప్రతినిధులు సతీష్ రెడ్డి గొట్టెముక్కల, శ్రీమతి శ్వేతా రెడ్డి, శ్రీమతి జాహ్ణవి దూసరి , మల్లేష్ పప్పుల తదితరులు పాల్గొన్నారు.
టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న కల్వకుంట్ల కవిత గారికి టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ప్రత్యేక కృతఙతలు తెలిపారు. కవిత గారితో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని మీడియాకి తెలిపారు. యూకే లో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఇతర వివరాలకు www.tauk.org.uk వెబ్ సైట్ ని సంప్రదించమని తెలిపారు.
I am very excited about the new initiative and future of TAUK. As an organization we have created strong objectives to do service to the community in UK and back home. This is not a time to be complacent or think that we have achieved the level of recognition that we have earned...
Great initiative by the passionate Telanganites to create one big platform for all Telanganites living in UK to build Banagru Telangana. Feel prestigious and proud to be part of the team....